Aswin Babu: అశ్విన్ బాబు హీరోగా 'వచ్చినవాడు గౌతమ్' 6 d ago

స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా అశ్విన్ బాబు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అశ్విన్ బాబు నటించిన తాజా సినిమా 'వచ్చినవాడు గౌతమ్'కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో అశ్విన్ బాబు కోపంగా చూస్తూ, చేతులకు రక్తం చెరిగినట్లు కనిపిస్తున్నారు. పోస్టర్ లో "గౌతమ్, యుద్ధం ప్రారంభమవుతుంది" అనే క్యాప్షన్ తో ఉంది. మెడికల్ యాక్షన్ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రంలో రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, శకలక శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'వచ్చినవాడు గౌతమ్' సినిమా ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచుతోంది.